Hyderabad ఆర్టీసీ బస్సు vs బైకర్: సాంప్రదాయినీ, సుద్దపూసనీ.. ఫైనల్ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

3 hours ago 1
హైదరాబాద్‌లో రాంగ్ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సుకు.. తన బైక్‌ను అడ్డుపెట్టి, డ్రైవర్‌ను నిలదీసిన ఓ బైకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి, బైక్‌ను అడ్డంగా ఉంచి డ్రైవర్‌ను ప్రశ్నించిన బైకర్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో ఫైనల్ ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని బస్సుకు అడ్డంగా ఉంచిన బైక్ మీద.. ఏకంగా 16 చలాన్లు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
Read Entire Article