ఈ ఏడాది సూపర్ ఎల్ నినో దెబ్బకు రుతుపవనాల కాలంలో సరైన వర్షాలు కురవలేదు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. తీవ్ర వర్షపాతం లోటు.. వర్షాకాలంలోనే భారీగా పడిపోయిన భూగర్భ జలాలతో తాగునీటికి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జల మండలి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం, నీటి సరఫరాను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.