సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్దీ.. దీని వల్ల ముప్పు కూడా అంతేస్థాయిలో ఉంటోంది. ముఖ్యంగా బ్యాంకులు, నగదు లావాదేవీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఆన్‌లైన్ ద్వారా పనులు సులభంగా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ చెల్లింపు నుంచి ఆధార్ అప్‌డేట్ లేదా ఏదైనా ఫారమ్ నింపడం వరకు ఇంటి వద్ద నుంచే పూర్తిచేసుకుంటున్నారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు దీనిని తమకు అనుకూలంగా మలచుకుని మోసాలకు తెగబడుతున్నారు.