KVP Ramachandra Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ స్పందించారు. తన ఫామ్ హౌస్‌కు హైడ్రా అధికారులను పంపించాలని, ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే.. తానే తన సొంత ఖర్చులతో కూల్చివేయిస్తానని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి కేవీపీ లేఖ రాశారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదని అన్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ గురించి మాట్లాడుతూ కేవీపీ ఫాం హౌస్ గురించి ప్రస్తావించారు.