ఐబొమ్మ (iBOMMA) నిర్వాహకుడు రవి రెండో విడత మూడు రోజుల కస్టడీ పూర్తయింది. పోలీసులు రవి మెయిల్స్ నుంచి 21 వేల సినిమాల వివరాలు... పైరసీకి సంబంధించిన అధునాతన సాంకేతిక సమాచారాన్ని సేకరించారు. ఓటీటీ కంటెంట్‌ను రికార్డ్ చేసి.. నాణ్యత పెంచడానికి కరేబియన్ దీవుల్లో ఔట్‌సోర్సింగ్ చేసుకున్నట్లు రవి తెలిపాడు. విచారణ అనంతరం రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ విచారణలో రవి చాలా వరకు సీక్రెట్స్ చెప్పాడు. అందులో ఐబొమ్మ పూర్తి పేరు ఏంటో చెప్పేశాడు.