ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఆర్కే మీనాను నియమించారు. శాంతి భద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి.. ఆపరేషన్స్ ఐజీపీగా శ్రీకాంత్‌లను బదిలీ చేశారు. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడిని బదిలీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హర్షవర్దన్ రాజు తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు.