భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. నేషనల్ స్పేస్ డే క్విజ్‌లో దేశవ్యాప్తంగా రెండో స్థానం సాధించి.. టాప్ 100 విజేతల్లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా త్వరలోనే శ్రీహరికోట ఇస్రో కేంద్రాన్ని సందర్శించే అవకాశం సాధించాడు. ఈ పర్యటనకు సంబంధించిన రైలు ప్రయాణ ఖర్చులు, హోటల్ వసతి, స్థానిక రవాణాను అంతా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఇతర విజ్ఞాన రంగాల్లోనూ ఆసక్తి చూపిన అనిల్ కుమార్‌కు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.