డీలిమిటేషన్ విషయమై చెన్నై వేదికగా శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన కూడా పాల్గొందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ ఆహ్వానించారని.. కానీ తాము హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చామని జనసేన లేఖ విడుదల చేసింది.