శ్రీకాళహస్తి జనసేనలో ఓ నామినేటెడ్ పదవి చిచ్చు రేపింది. కొట్టే సాయి ప్రసాద్‌కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ పదవి అప్పగించడంపై జనసేన మాజీ ఇంఛార్జి కోట వినూత వర్గం భగ్గుమంటోంది. ఈ మేరకు కొట్టే సాయికి శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ పదవి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కోట వినూత జనసేనాని పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు డ్రైవర్ హత్య కేసు ఆరోపణలతో కోట వినూతను జనసేన సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.