లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ జనసేన పార్టీ నాయకత్వం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.