Job Mela: ఉపాధి కూలీల పిల్లలకు రోజుకు రూ.307 స్టైఫండ్.. ఆ జిల్లా వారికి మంచి ఛాన్స్..

7 months ago 20
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. జనవరి ఆరో తేదీన పెదబయలులోని వెలుగు కార్యాలయంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి వివిధ అంశాలపై ఉచితంగా శిక్షణ అందిస్తారు. అలాగే భోజనం, వసతి సదుపాయం కూడా పూర్తి ఉచితం. ఇక ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పని పూర్తి చేసుకున్న ఉపాధి హామీ కూలీల పిల్లలు అయితే వారికి రోజుకు 307 రూపాయలు చొప్పున స్టైఫండ్ కూడా అందిస్తారు. ఈ విషయాన్ని పెదబయలు ఉపాధి హామీ పథకం ఏపీవో వెల్లడించారు.
Read Entire Article