Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు.. ఈ 400 ఎకరాల భూములను ప్రభుత్వం చదును చేసేందుకు వెళ్లగా.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే అక్కడ ఉన్న వన్యప్రాణులు చనిపోయాయి అంటూ ఒక జింక మృతి చెందిన ఫోటో గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. నిజంగానే ఆ భూముల్లో జింక చనిపోయిందా. ఆ ఫోటో వెనుక దాగి ఉన్న నిజం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.