Karimnagar Centralized Community Kitchen: సర్కార్ బడి పిల్లల కోసం ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ మెనూ.. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభించిన మంత్రి

1 hour ago 1
Telangana Breakfast Scheme: కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. జిల్లాలోని 17 మండలాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలలకు చెందిన 49,025 మంది విద్యార్థులకు ఇక్కడి నుంచి ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందనుంది. అధునాతన యంత్రాలతో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ వంటి వంటకాలు తయారు చేయనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, హాజరు, ఏకాగ్రత, విద్యా పనితీరును మెరుగుపరచడం కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
Read Entire Article