తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నేత, రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ మారిపోయారని..అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని, ఉద్యమకారులకు ప్రాధాన్యం తగ్గడం అసంతృప్తికి దారితీసిందని అభిప్రాయపడ్డారు. గద్దర్ వివాదం కూడా ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని బీజేపీ సవాలుగా భావించిందని విశ్లేషించారు. బీజేపీ బలం తగ్గడం కాంగ్రెస్‌కు అనుకూలించిందని చెప్పారు.