సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు బిగ్ ట్విస్ట్ తిరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కోనేటి ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో ఈ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారంటూ వారి తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు కోనేటి ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.