హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న లులు మాల్ జూలై 3 నుంచి 6 వరకు ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. అంటే నేటి నుంచి ఆఫర్ సేల్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా హైపర్ మార్కెట్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 50 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ దుస్తులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. షాపింగ్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాల్ నిర్వాహకులు కోరుతున్నారు.