అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో డ్రోన్ ఎగురవేశానని 16 రోజులు జైల్లో పెట్టారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాము కక్షలకు పోకుండా పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ స్వాతంత్ర్య ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా..? అని ప్రశ్నించారు. తనకు లేని రంకులు అంటగట్టరాని ఆగ్రహం వ్యక్తం చేశారు.