KTR: తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గతంలో తమ ప్రభుత్వం నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఉపయోగించుకుంటే సరిపోతుందని కేటీఆర్ హితవు పలికారు.