kurnool bus fire accident mystery: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు నగర శివారులో నేషనల్ హైవేపై బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. అయితే, బైక్‌పై శివశంకర్‌తో పాటు మరో యువకుడు ఉన్నట్టు ఓ పెట్రోల్ బంకులో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అతన్ని ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నించిన కర్నూలు పోలీసులు.. కీలక వివరాలు రాబట్టారు.