మంత్రాలయంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి వచ్చే భక్తుల వాహనాలు, స్థానిక వాహనాలతో రాఘవేంద్ర కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వారాంతాలతో పాటుగా గురు, శుక్రవారాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో మంత్రాలయంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం తాజాగా 49 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇందులో 16 కోట్లు భూసేకరణకు కేటాయించారు. డిసెంబర్ ఆఖరు నాటికి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు.