బతుకమ్మ పండగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 సాయం, కల్యాణలక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా వైరల్ అవుతున్న వీడియో డీప్‌ఫేక్‌గా తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ తేల్చింది. 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన బసవ జయంతి వేడుకల అసలు దృశ్యాలకు ఏఐతో రూపొందించిన ఆడియోను జత చేశారు. అయితే రూ.2,500 సాయం మాత్రం కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి హామీలో ఉంది. రెండు తులాల బంగారం మాత్రం ఆరు గ్యారంటీల్లో లేదు.