జానీ మాస్టర్ వ్యవహారం ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు అని, బాధితురాలికి బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అని పిలవబడే షేక్ జానీ పాషా లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు..