Manchu Manoj vs Mohan Babu | మోహన్ బాబుకు మంచు మనోజ్ బిగ్ షాక్
మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్ లీగల్ సర్టిఫికెట్) చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.