దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు చుట్టిముడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోవడం లేదంట సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్లు, వరదలతో నష్టపోవడం. వీటిని ఎలాగోలా తట్టుకుని నిలబడతామంటే.. పొలాల్లో పంటలను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోతుంటారు. తాజాగా, ఓ రైతు పండించిన పత్తి పంటను రాత్రికి రాత్రే కోసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మరి కొద్ది రోజుల్లో కోయడానికి సిద్దమైన ఆయన దసరా రోజు పూజలు కూడా చేశాడు.