hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న గణేశ్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 25 నుంచి 27 వరకు రాత్రివేళల్లో 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనుంది. ఖైరతాబాద్ 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం 25న ఉదయం శోభాయాత్రతో ప్రారంభమై మధ్యాహ్నం 12లోపు హుస్సేన్‌సాగర్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్, క్రేన్లు, ప్లాట్‌ఫారమ్‌లు, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.