Chandrababu Speech in Vizag: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖపట్నంలో తొలుత రోడ్ షో నిర్వహించిన మోదీ.. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుమారు రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ బహిరంగసభలో ప్రసంగించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు..ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు మోదీ అని చెప్పిన చంద్రబాబు.. అమరావతిని సందర్శించాలని కోరారు.