ముమైత్ ఖాన్.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐటెం సాంగ్‌లతో మొదలు పెట్టి.. హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేసి తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. మైసమ్మ IPS సినిమా ముమైత్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యోదన వంటి సినిమాల్లో కీలక పాత్రలతో మెప్పించింది. చివరగా ఈ బ్యూటీ RDX లవ్ సినిమాలో నటించింది.