టాలీవుడ్ నటుడు నాగార్జున తన కొడుకు నాగ చైతన్యకు ప్రత్యేకంగా ఖరీదైన లగ్జరీ కారు లెక్సస్ ఎల్‌ఎమ్ ఎంపీవీని బహుమతిగా ఇచ్చారు. ఈ కార్ విలువ ₹2.5 కోట్లు. నాగ చైతన్య త్వరలో శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్న సందర్భంగా ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కారు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రిజిస్టర్ చేయించారు.