ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతి ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసును కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. త్వరలోనే ఎయిర్ పోర్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు, శ్రీకాకుళం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని.. స్థలం దొరికితే శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.