APNRTS Foreign Coins From Tirumala Srivari Hundi: తిరుమల శ్రీవారి హుండీలో విదేశాలలో స్థిరపడిన భారతీయులు అక్కడి కరెన్సీ నోట్లు, నాణేలను కానుకలుగా సమర్పిస్తుంటారు. హుండీలలోని విదేశీ కరెన్సీని బ్యాంకులు స్వీకరిస్తున్నాయి.. కానీ విదేశీ నాణేలు మాత్రం తీసుకోవడం లేదు. అందుకే ఈ నాణేలను ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కొనుగోలు చేసి ఎన్ఆర్ఐలకు అందిస్తోంది. ఈ నాణేలు కావాల్సిన వారు తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.