Numaish 2025: నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు ఈసారి సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నుమాయిష్ చరిత్రలోనే ఒక్క రోజు అత్యధికంగా 76,500 మంది సందర్శకులు వచ్చారు. ఈసారి 2200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జేబుదొంగలను, ఆకతాయిలను సీసీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో ఆటకట్టిస్తున్నారు.