ప్రమాదం ఎప్పుడు.. ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలియదు. అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారిని మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు స్నేహితులతో, బంధువులతో కలిసిమెలిసి ఉంటూ.. సడన్‌గా హార్ట్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదొక్కటే కాదు.. రోడ్డు ప్రమాదాలు కూడా అకస్మాత్తుగా జరిగేవే. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా.. వాహనం నడిపే వారికే కాకుండా.. రోడ్లపై వాకింగ్ చేసేవారికి.. పనులు చేసే వారికి కూడా ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.