అది మంగళవారం మధ్యాహ్నం... పహల్గామ్ కొండల మధ్య వైలెన్స్ విళయతాండవం చేసింది. చుట్టూ మంచు పరచిన గిరుల మధ్య, పచ్చని లోయల వెంటే పయనించిన పర్యాటకుల హృదయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ స్వర్గపు నిశ్శబ్దాన్ని చేధించుకుంటూ ఊహించని విధంగా కాల్పుల శబ్దం ఆకాశాన్ని చీల్చింది.