Palasa Road Accident: హైవేపై గాలిలోనే పల్టీలు కొట్టిన కారు.. ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

2 weeks ago 5
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం హైవేపై ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో అదుపు తప్పిన కారు.. రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి, అవతలివైపునకు పల్టీ కొట్టి, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ కుటుంబం పూరి జగన్నాథుడి దర్శనం అనంతరం పర్లాకిమిడి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read Entire Article