Pantham Nanaji: డాక్టర్‌ను బెదిరించి, చంపేస్తా అంటూ జనసేన ఎమ్మె్ల్యే పంతం నానాజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. డాక్టర్ పెట్టుకున్న మాస్క్‌ను తొలగించి కొట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఎమ్మెల్యే అనుచరులు.. ఆ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మందలించడంతో ఆ డాక్టర్‌కు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు.