టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై మాట్లాడాలనే దానిపై ఆయన నెటిజనం అభిప్రాయాలను కోరారు. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు, సమస్యలను తమ దృష్టికి తెస్తే.. టీడీపీ ఎంపీలం పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు.