సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతుర్ని ప్రేమించాడనే కారణంతో యువతి తల్లి ఓ యువకుణ్ని ఇంటికి పిలిచి.. అతనిపై బ్యాటుతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీరంగూడలో చోటుచేసుకుంది. జ్యోతి శ్రవణ్ సాయి అనే యువకుణ్ని ఇంటికి పిలిచిన యువతి తల్లి.. అతనిపై బ్యాటుతో దాడి చేసినట్లు తెలిసింది. యువతి సాయంతో ఫోన్ చేయించి శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.