Hyderabad TGSRTC Buses: హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు త్వరలో బిగ్ రిలీఫ్ దక్కనుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కేంద్రం కేటాయించిన 2,200 ఎలక్ట్రిక్ బస్సులు దశలవారీగా నగరానికి రానున్నాయి. నవంబర్‌లో తొలి విడతగా 137 బస్సులు అందుబాటులోకి రానుండగా.. 2028 జనవరి నాటికి మొత్తం బస్సుల పంపిణీ పూర్తికానుంది. మహాలక్ష్మి పథకం తర్వాత రోజువారీ ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. కొత్త బస్సులతో రద్దీ తగ్గించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ భావిస్తోంది.