సినీ నటుడు పోసానికి మరోసారి బెయిల్ లభించింది. సీఐడీ కేసులో గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలంటూ పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.