సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టైన పోసాని కృష్ణ మురళి.. 24 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి శనివారం విడుదలయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోసాని అరెస్టైన సంగతి తెలిసిందే. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళికి.. గుంటూరు కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకు రాగానే పోసాని భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు.