హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ జపాన్ (Kalki Japan Release) 2025 జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్ (Prabhas) సారీ చెప్పారు. ఈ మేరకు స్పెషల్ వీడియో (Prabhas Video about Japan Fans) రిలీజ్ చేశారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవడంతో ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని అభిమానులకు చెప్పారు. తాను బాగానే ఉన్నానన్నారు. ‘కల్కి’ని ఎంజాయ్ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడారు.