కుటుంబ సమేతంగా హాయిగా ఆస్వాదించదగ్గ హాస్యభరిత చిత్రాల స్పెషలిస్టుగా పేరొందిన శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన చిత్రం "సారంగపాణి జాతకం". ఈ సినిమా ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా తెరకెక్కి, ఇప్పటివరకు విడుదలైన "సారంగో సారంగా", "సంచారి సంచారీ" పాటలతో ట్రెండ్‌లో దూసుకుపోతోంది.