Vemulawada Rajarajeshwara Swamy Temple: దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా దుమ్ములేపుతోంది. అతితక్కువ సమయంలోనే.. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి సినిమాగా రికార్డు సృష్టించి.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో.. పుష్ప-2లో నటించిన నటీనటులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఇదే క్రమంలో.. పుష్ప-2 సినిమా నటి గార్లపాటి కల్పలత.. వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే.. సినిమాలో పుష్ప రాజ్ తల్లిగా కనిపించిన కల్పలత.. గుడిలో కాషాయ వేషదారణలో కనిపించి ఆశ్చర్యపరిచారు.