Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. అదే జెలసీ అంటూ..

6 months ago 6
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా గురించి వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజుకు ఎదిగారన్న అంబటి రాంబాబు.. దీంతో కొంతమందికి జెలసీగా ఉందన్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పుష్ప 2 మూవీని అడ్డుకోలేరని.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article