రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చేసింది. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న RC16 నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా .. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదలచేసింది. పొడవాటి జుట్టు..గుబురు గడ్డం.. ముక్కుకు రింగ్‌తో.. చెర్రీ ఊరమాస్ లుక్‌లో కనిపించారు. చిరంజీవి ఇంత మాస్‌గా ఎప్పుడూ కనిపించలేదని.. ఫ్యాన్ సంబరపడుతున్నారు. ఇక ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు. పెద్ది అనే పేరును ఖరారు చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని టాక్. రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తో పాటు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.