RathaSapthami: తిరుమల శ్రీవారి ఆలయం రథ సప్తమి వేడుకలకు సిద్ధం అవుతోంది. ఒకే రోజున శ్రీవారు 7 వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు పోయిన నేపథ్యంలో ఈసారి పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.