Telangana Ration Rice: మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరలేపుతున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి నూకలను వేరు చేసి పాలిషింగ్ అనంతరం వివిధ బ్రాండ్ల పేర్లతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు సన్న వడ్ల కొరతతో మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగడం ఈ రకమైన దందా ఎక్కువైంది. దీంతో రేషన్ లబ్ధిదారులు తక్కువ ధరకు బియ్యం విక్రయించి, అదే బియ్యాన్ని అధిక ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది.