Veeramachineni Ramakrishna: వీఆర్‌కే డైట్ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఓ న్యాయ విద్యార్థికి ఇన్సులిన్ ఆపేయాలని సూచించడంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్న ఆరోపణలపై వీరమాచినేని రామకృష్ణ, కోటేశ్వరరావులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు వీరమాచినేనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి చికిత్సా విధానాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.