Indiramma Tower: హైదరాబాద్‌లో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శేరిలింగంపల్లి రాయదుర్గం–మల్కం చెరువు ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఒక్కో నియోజకవర్గంలో తొలి దశగా 480 ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక లాటరీ ద్వారా పారదర్శకంగా జరుగుతుందని, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు.