Republic Day parade: రిపబ్లిక్‌డే పరేడ్‌లో ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం

21 hours ago 2
Republic Day parade: దేశ 76వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఏటికొప్పాక బొమ్మల శకటం ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడంలో ఈ ఏటికొప్పాక బొమ్మలు ప్రముఖ పాత్ర పోషించాయి. మామూలు కర్రతో తయారు చేసే ఈ ఏటికొప్పాక బొమ్మలకు దేశవిదేశాల్లోనూ చాలా డిమాండ్ ఉంది. ఎటు చూసినా నున్నగా ఉండే ఈ ఏటికొప్పాక బొమ్మలు.. ఎప్పటినుంచో చిన్న పిల్లల చేతుల్లో ఆటవస్తువుల్లా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఈ బొమ్మలు చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి చరిత్ర ఉన్న ఈ ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించడంతో అందర్నీ ఆకట్టుకున్నాయి.
Read Entire Article